04-07-2020 Current Affairs in Telugu – Daily Test

Spread the love

Most Important Current Affairs For APPSC/TSPSC/Central Jobs

Download PDF Link in bottom of this Test,

Daily Current Affairs & GK : 04-07-2020
 
 
1.    అంతరిక్షంలోని కి మనుషులను తీసుకెళ్లడానికి అడ్వాన్స్‌డ్‌ బెలూన్‌ ప్రాజెక్ట్‌ ‘స్పేస్‌షిప్‌ నెప్ట్యూన్‌’ను ప్రారంభించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ..?
A.    నాసా
B.    స్పేస్ ఎక్స్
C.    ఇస్రో
D.     స్పేస్‌ పర్స్పెక్టివ్‌


Ans: D
 
అంతరిక్షం అంచులకు బెలూన్‌లో..
 
ఫ్లోరిడా :అంతరిక్షం అంచుల్లోకి మనుషులను బెలూన్లలో తీసుకెళ్లేందుకు ఓ కంపెనీ సిద్ధమవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ‘స్పేస్‌ పర్స్పెక్టివ్‌’ అనే  స్టార్టప్‌.. బెలూన్‌ రైడ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. వినియోగదారులను అంతరిక్షం అంచులకు చేర్చేందుకు ఈ కంపెనీ అడ్వాన్స్‌డ్‌ బెలూన్‌ ప్రాజెక్ట్‌ ‘స్పేస్‌షిప్‌ నెప్ట్యూన్‌’ను రూపొందించే ప్రణాళికల్లో ఉంది. దీని ద్వారా మరికొద్ది సంవత్సరాలలో మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యోచిస్తోంది.
2021 ఆరంభంలో స్పేస్‌షిప్‌ నెప్ట్యూన్‌తో ఈ కంపెనీ ప్రయోగాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ హైటెక్‌బెలూన్‌ ప్రయోగ కేంద్రంగా అలాస్కాలోని పసిఫిక్‌ స్పేస్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌ని ఉపయోగించుకోనుంది


 
 
 

2.    జియో లో 1,894 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టిన ప్రఖ్యాత ఇంటెల్ సంస్థ ఏ దేశానికి చెందినది..?
A.    జపాన్
B.    దక్షిణ కొరియా
C.    ఉత్తర కొరియా
D.    అమెరికా


Ans: D
జియోలోకి ఇంటెల్‌ రూ.1,894 కోట్ల పెట్టుబడులు
 
ముంబయి: ప్రముఖ టెలికాం రంగ సంస్థ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌కు చెందిన ‘ఇంటెల్‌ క్యాపిటల్‌’ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 1,894 కోట్లు. జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఇది పన్నెండోది. ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్‌, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎల్ కాటర్‌టన్‌, వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వెల్లువతో రిలయన్స్‌ ఇప్పటికే నికర రుణరహిత సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. 
 
 
Static GK About Intel : 
ఏర్పాటు : జూలై 18, 1968
ప్రధాన కార్యాలయం : కాలిఫోర్నియా, అమెరికా
ఫౌండర్ & చైర్మన్: గోర్డాన్ మూరే
 


 
3.    ICMR కరోనా మహమ్మారి కి ఆగస్ట్ 15 లోగా వ్యాక్సిన్ సిద్ధం చేయనున్నట్లుగా ప్రకటించింది అయితే ఈ వ్యాక్సిన్ ఏ సంస్థ అందించనుంది..?
A.    శాంతా బయోటెక్
B.    భారత్ బయోటెక్
C.    రెడ్డి ల్యాబ్స్
D.    పతాంజలి


Ans: B
 
 
ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్‌‌? 
గడువు నిర్దేశించుకున్న ఐసీఎంఆర్‌!
 
హైదరాబాద్‌: ‘కరోనా’ వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన సంస్థ వెల్లడిచింది
Static GK About ICMR : 
ఏర్పాటు : 1911 – IFRA ( ఇండియన్ రిసెర్చ్ ఫండ్ అస్సోషియేషన్ ), 1949-ICMR
ప్రధాన కార్యాలయం : న్యూ ఢిల్లీ
Secretary & Director :  Balaram Bhargava
 


 
 
4.    ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి  “ సరోజ్‌ ఖాన్‌ “ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు..?
A.    శాస్త్ర సాంకేతిక రంగం
B.    విద్య
C.    సినీ పరిశ్రమ
D.    శాస్త్రవేత్త


Ans: C
 
‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ ఇక లేరు..
 
ముంబయి: మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్యదర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె‌ చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా సరోజ్‌ ఖాన్‌ ప్రసిద్ధి గాంచారు. 
 


 
 
5.    ఇటీవల కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం సర్‌ ఎవర్టన్‌ వీక్స్‌ ఈ దేశానికి చెందిన వ్యక్తి..?
A.    వెస్టిండీస్
B.    ఆస్ట్రేలియా
C.    సౌత్ ఆఫ్రికా
D.    ఇంగ్లాండ్


Ans: A
 
 
 
విండీస్‌ దిగ్గజం ఎవర్టన్‌ మృతి
ఆనాటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు
సంతాపం తెలిపిన ఐసీసీ, క్రికెట్‌ ప్రపంచం
బ్రిడ్జ్‌టౌన్‌
 
విండీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ ఎవర్టన్‌ వీక్స్‌ తుదిశ్వాస విడిచాడు. 95 ఏళ్ల వయసున్న ఆయన బుధవారం మరణించినట్లు క్రికెట్‌ వెస్టిండీస్‌ ప్రకటించింది. బార్బడోస్‌లో జన్మించిన ఈ మాజీ బ్యాట్స్‌మన్‌.. అప్పటి అరివీరభయంకర విండీస్‌ జట్టులో సభ్యుడు. 1948లో టెస్టు అరంగేట్రం చేసిన ఆయన దశాబ్ద కాలం పాటు ఆటలో కొనసాగాడు. 22 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. తన కెరీర్‌లో 48 టెస్టుల్లో 58.61 సగటుతో 4,455 పరుగులు చేశాడు. అరంగేట్ర ఏడాదిలోనే వరుసగా అయిదు శతకాలు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌పై 141 పరుగులతో జోరు మొదలెట్టిన ఎవర్టన్‌.. ఆ తర్వాత భారత్‌లో వరుసగా 128, 194, 162, 101 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల దగ్గర రనౌటయ్యాడు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. వీక్స్‌ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా, విశ్లేషకుడిగా, జట్టు మేనేజర్‌గా, మ్యాచ్‌ రిఫరీగా విభిన్న పాత్రలు పోషించాడు.
 


 
 
 
 

6.    ఇటీవల కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో “అంతర్జాతీయ డేటా” కేంద్రాన్ని ఈ ప్రముఖ నగరం లో ఏర్పాటు చేయనున్నారు..?
A.    బెంగుళూర్
B.    పూణే
C.    హైదరాబాద్
D.    చెన్నై


Ans: 3

Ans: C
రాజధానిలో అంతర్జాతీయ డేటా కేంద్రం
రూ. 500 కోట్లతో ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు
అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల కేంద్రంగా హైదరాబాద్‌
 
ఈనాడు, హైదరాబాద్‌: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) హైదరాబాద్‌లోని నార్సింగిలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న అంతర్జాతీయ అధునాతన డేటా కేంద్రానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ప్రగతిభవన్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా నెలకు నాలుగు వేల మిలియన్ల లావాదేవీలతో రూ.15 లక్షల కోట్ల చెల్లింపుల సామర్థ్యంతో హైదరాబాద్‌ అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల కేంద్రాల్లో ఒకటిగా మారబోతోంది.
 
 
 
 
 
 
 
7.    నార్వే దేశం లో భారత తదుపరి రాయబారిగా నియమితులైన ప్రముఖ తెలుగు వ్యక్తి ఎవరు..?
A.    రామకృష్ణ
B.    బాల భాస్కర్
C.    శ్రీనివాసులు
D.    వెంకటరమణ


Ans: B
 
 
 
నార్వే రాయబారిగా బాలభాస్కర్‌
గతంలో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా బాధ్యతలు
 
ఈనాడు, హైదరాబాద్‌: నార్వే దేశంలో భారత రాయబారిగా బి.బాలభాస్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమాసియా దేశాల సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. 1993 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కు చెందిన అధికారి. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. గతంలో హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘ఇండియాస్‌ ఎనర్జీ సెక్యూరిటీ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌’ అనే అంశంపై పీహెచ్‌డీ పొందారు. బాలభాస్కర్‌ పాలస్తీనా, అమెరికా, చైనా రాయబార కార్యాలయాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు.
Static GK About Norway : 
ఏర్పాటు : 7 జూన్ 1905
రాజధాని : ఓస్లో
అధికార భాష: నార్వేజియన్
అధికార కరెన్సీ : నార్వేజిన్ క్రోన్
Prime Minister : Erna Solberg
 


 
8.    ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సమాచార కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు..?
A.    రమేష్ కుమార్
B.    వినోద్ కుమార్
C.    ప్రవీణ్ కుమార్ 
D.    నరేష్ కుమార్


Ans: A
 
 
రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌
 
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్ర సమాచార కమిషనర్‌గా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రేపాల శ్రీనివాసరావును నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు, అరవై అయిదేళ్ల వరకు.. ఏది ముందైతే అప్పటిదాకా వారు పదవుల్లో కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.


 
 
 
 
 
 
9.    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల ను ప్రోత్సహించడానికి ‘ప్రథమ్‌’ అప్ నీ ఎప్పటి నుండి అందుబాటులోకి తేనున్నారు..?
A.    జులై 10
B.    ఆగస్టు 1
C.    జులై 30
D.    ఆగస్టు 30


Ans: B
 
 
ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి ‘ప్రథమ్‌’ యాప్‌
నగదు రహిత లావాదేవీలకు ఆర్టీసీ ప్రాధాన్యం
37 మంది ప్రయాణికులకు కరోనా
ఈనాడు, అమరావతి: బస్సుల్లో నగదు లావాదేవీలను నియంత్రించే క్రమంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రథమ్‌ యాప్‌ ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానున్నదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపీఎస్‌ఆర్టీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని రకాల బస్‌ సర్వీసుల కోసం యాప్‌ నుంచి టికెట్లు పొందవచ్చని సూచించింది.
Static GK About APSRTC : 
ఏర్పాటు : January 11, 1958
ప్రధాన కార్యాలయం : విజయవాడ
సంబంధిత మంత్రి : పేర్ని వెంకట్రామయ్య
MD : నిమ్మగడ్డ సురేంద్ర బాబు – I.P.S


 
10.    భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదన కి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.అయితే వీటిని ఏ దేశం నుండి కొనుగోలు చేయనున్నారు..?
A.    అమెరికా 
B.    ఫ్యాన్స్
C.     రష్యా
D.    జర్మనీ


Ans: C
 
కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ 2020 జూలై 2 న ఆమోదించింది. ఇది భారత వైమానిక దళం తన ఫైటర్ స్క్వాడ్రన్లను పెంచాల్సిన చిరకాల అవసరాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.  33 కొత్త యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు, ప్రస్తుతం ఉన్న 59 మిగ్ 29 విమానాలను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు.  మొత్తం కొనుగోలు మరియు అప్‌గ్రేడేషన్‌కు రూ .18,148 కోట్లు ఖర్చవుతాయి.
 
 కొత్తగా వచ్చిన 33 విమానాలలో, కొత్త 21 మిగ్ -29 విమానాల సేకరణ మరియు ప్రస్తుతం ఉన్న 59 మిగ్ -29 విమానాల అప్గ్రేడేషన్‌ను రష్యన్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ‘మిగ్’ (మికోయన్ అని కూడా పిలుస్తారు) 7418 కోట్ల రూపాయలకు చేయనుంది.


 
11.    నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభించింది..?
A.    ఢిల్లీ
B.    ముంబై
C.    తెలంగాణ
D.    ఆంధ్ర ప్రదేశ్


Ans: D
 
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన.. ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభమైంది.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 1న తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ‘ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణ అధ్యాయం.. మార్పు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం.. గతానికి ఇప్పటికీ తేడాను ప్రజలందరూ ఒకసారి గమనించాలి’ అని కోరారు.


 
 
 
 
12.    ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఆహ్వానిస్తూ దేనికోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ..?
A.    ప్రైవేటు రంగానికి ఆహ్వానం
B.    ఉద్యోగుల వేతనాల పెంపు
C.    కొత్త ఉద్యోగ వివరాలు
D.    నూతన ఆవిష్కరణలు


Ans: A
 
ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి జూలై 1న భారత రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది.
 
ఈ మేరకు 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని రైల్వే శాఖ అంచనా. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే ప్రథమం.


 
 
 
Additional Questions : 
 
1.    క్రిమినల్ చట్టంలో సంస్కరణల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) రణబీర్ సింగ్
2) జిఎస్ బాజ్‌పాయ్
3) బలరాజ్ చౌహాన్
4) మహేష్ జెఠ్మలానీ


Ans: 1


 
 
 
2.    రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లకు వేదికను అందించడానికి ఏ బోర్డు ‘యాక్సిలరేట్ విజ్ఞాన్’ పథకాన్ని ప్రారంభించింది?
1) టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు
2) సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్
3) సైంటిఫిక్ రీసెర్చ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
4) బోర్డ్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్


Ans: 2


 
 
 
 
3.    ఇటీవల 1.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తారమైన తోటల ద్వారా గ్రీన్ కవర్ పెంచాలని నిర్ణయించిన రాష్ట్రాన్ని కనుగొనండి.
1) ఉత్తర ప్రదేశ్
2) ఒడిశా
3) గుజరాత్
4) తెలంగాణ


Ans: 2


 
 

4.    ఇటీవల మంచి క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన మంత్రిత్వ శాఖకు పేరు పెట్టండి.
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలమంత్రిత్వ శాఖ


Ans: 3


 

 
5.    మిడుతలు దాడిని పరిష్కరించడానికి ఇటీవల గ్రేటర్ నోయిడా నుండి బెల్ 206-బి 3 హెలికాప్టర్‌ను ఎవరు ఫ్లాగ్ చేశారు?
1) నితిన్ గడ్కరీ
2) హర్సిమ్రత్ కౌర్ బాదల్
3) ప్రహ్లాద్ సింగ్ పటేల్
4) నరేంద్ర సింగ్ తోమర్


Ans: 4
 


 
 

6.    కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (CAMS) భాగస్వామ్యంతో ‘మ్యూచువల్ ఫండ్స్‌కు వ్యతిరేకంగా ఇన్‌స్టా లోన్స్’ సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
2) ఐడిఎఫ్‌సి బ్యాంక్
3) ఐసిఐసిఐ బ్యాంక్
4) ఆర్‌బిఎల్ బ్యాంక్


Ans: 3


 
 

 
7.    జిఎస్‌డిపిలో 3% నుండి రుణాలు తీసుకునే పరిమితిని 5% కి పెంచడానికి వీలు కల్పించే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని ఏ రాష్ట్రం సవరించింది?
1) ఉత్తర ప్రదేశ్
2) బీహార్
3) గుజరాత్
4) తెలంగాణ


Ans: 4

 
 
 
 
8.    జెనీవాలోని యుఎన్ మరియు ఇతర సంస్థలకు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు?
1) టిఎస్ తిరుమూర్తి
2) ఇంద్ర మణి పాండే
3) శ్రీకుమార్ మీనన్
4) వినయ్ కుమార్


Ans: 2


 

 
9.    శశాంక్ మనోహర్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాత్కాలిక ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మను సాహ్నీ
2) రవిశాస్త్రి
3) సౌరవ్ గంగూలీ
4) ఇమ్రాన్ ఖ్వాజా


Ans: 4


 
 
 
10.    CMFRI యొక్క “2019 లో భారతదేశంలో వార్షిక మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్” నివేదిక ప్రకారం, వాల్యూమ్ ఆధారంగా చేపల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) కేరళ
2) తమిళనాడు
3) గుజరాత్
4) మహారాష్ట్ర


Ans: 2


DOWNLOAD PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *