Most important for APPSC, TSPSC, RRB and central Jobs also
Daily Current Affairs & GK – 22-06-2020 1. ఇటీవల ప్రతిష్టాత్మకమైన అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గా నియమితులైన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు..? A. సేతురామన్ పంచనాథన్‌ను B. బాలసుబ్రమణ్యం C. సుధా చంద్రన్ D. శివరామరాజు
Ans: A
అమెరికా ఎన్ఎస్ఎఫ్ అధిపతిగా భారత సంతతి శాస్త్రవేత్త వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్‌ను ప్రతిష్ఠాత్మకమైన అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్)కు డైరెక్టర్‌గా నియమించేందుకు ఆ దేశ సెనేట్ సమ్మతించింది. సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రాథమిక పరిశోధనకు ఈ సంస్థ నిధులు అందిస్తుంటుంది. ఈ ఫౌండేషన్ వార్షిక బడ్జెట్ 740 కోట్ల డాలర్లుగా ఉంది. సేతురామన్ (58) ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
2. ఇటీవల ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ సైబర్ నేరాలు, భద్రతపై ‘ టీన్స్ ఆన్లైన్ సర్వే’ ప్రారంభించారు..? A. ముంబై పోలీస్ B. ఢిల్లీ పోలీస్ C. హైదరాబాద్ పోలీస్ D. బెంగళూరు పోలీస్
Ans: 3 సైబర్ భద్రతపై ‘టీన్స్ ఆన్లైన్ సర్వే’ ఈనాడు, హైదరాబాద్: కరోనా కారణంగా పిల్లలు, యువత ఇంటికే పరిమితమైనందున సైబర్ నేరాలు, భద్రతపై వారికి ఉన్న అవగాహనను అధ్యయనం చేసేందుకు తెలంగాణ షీటీమ్స్ ‘టీన్స్ ఆన్లైన్ సర్వే’ను ప్రారంభించింది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం, సైబర్ భద్రత తదితర అంశాలపై పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఈ మేరకు షీటీమ్స్ అదనపు డీజీ స్వాతిలక్రా గోడపత్రికను ఆవిష్కరించారు.
3. ఇటీవల కరుణ వైరస్ కి మందు కనిపెట్టిన గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఔషధానికి పెట్టిన పేరు..? A. ఫాబీఫ్లూ B. బేబీ ఫ్లూ C. కోవిద్ ఫ్లూ D. కాన్ ఫ్లూ
Ans: A
ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ, వైరస్‌ను నిరోధించే మందు ఇంకెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్న వేళ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుభవార్త తెలిపింది. కరోనాపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీవైరల్ ఔషధం ఫావిపిరావిర్‌ను ఫాబీఫ్లూ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ఔషధం స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నది. మూడు దశల హ్యూమన్ ట్రయల్స్‌లో ఇది రుజువైందని వెల్లడించింది. ఈ ఔషధంతో 88% సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది.
4. ప్రఖ్యాత బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎన్నవా స్థానంలో ఉన్నారు..? A. 10 B. 9 C. 11 D. 12
Ans: B
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రపంచంలో 09 వ కుబేరుడిగా నిలిచాడు. ముఖేష్ అంబానీ రియల్ టైమ్ నెట్ వర్త్ మొదటిసారి 60 బిలియన్ డాలర్లను దాటింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ రియల్ టైమ్ నెట్ వర్త్ ఇప్పుడు 60.3 బిలియన్ డాలర్లు (రూ. 4.58 లక్షల కోట్లు) వద్ద ఉంది. ముఖేష్ అంబానీ సంపద ఒక రోజులో 1.16 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆర్ఐఎల్ షేర్ ధర శుక్రవారం రికార్డు స్థాయిలో రూ.1737.95 ను తాకింది. ఇది అంతకుముందు రూ.1655 ముగింపు కంటే 5 శాతం ఎక్కువ. ముఖేష్ అంబానీ దాటికి స్పానిష్ ఫ్యాషన్ రిటైల్ చైన్ జారా వ్యవస్థాపకుడు అమానికో ఒర్టెగా వెనబడిపోయారు. ఒర్టెగా ప్రస్తుతం 59 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు
5. ఈ ఆసియా దేశా నికి ఇటీవల చైనా 97% ఎగుమతులపై సుంకపు మినహాయింపులు వర్తింప చేసింది..? A. నేపాల్ B. బంగ్లాదేశ్ C. శ్రీలంక D. పాకిస్తాన్
Ans: B
ఇటీవల, బంగ్లాదేశ్ నుండి 97% ఎగుమతులకు చైనా సుంకం మినహాయింపు ప్రకటించింది.
ప్రధానాంశాలు నేపధ్యం: కోవిడ్ -19 మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బంగ్లాదేశ్ తన ఎగుమతి వస్తువులను సుంకాల నుండి మినహాయించాలని చైనాకు లేఖ రాసింది.
6. ఇటీవల, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మనీలాండరింగ్ మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (EAG) ఎన్నావ ప్లీనరీ సమావేశంలో భారత్ పాల్గొంది..? A. 30 B. 29 C. 31 D. 32
Ans: D
ఇటీవల, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మనీలాండరింగ్ మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (EAG) ప్లీనరీ సమావేశంలో వర్చువల్ 32 వ ప్రత్యేక యురేషియన్ గ్రూప్‌కు భారతదేశం హాజరైంది.
7. 6 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి..? A. Yoga for Health and yoga with Family B. Yoga at out and yoga with Family C. Yoga at ground and yoga with Family D. Yoga at home and yoga with Family E. Yoga at life and yoga with Family
Ans: A
6 వ అంతర్జాతీయ యోగా 2020 యొక్క థీమ్ “ఇంట్లో యోగా మరియు కుటుంబంతో యోగా”. COVID-19 కారణంగా, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఉదయం 7 గంటలకు వాస్తవంగా జరుపుకుంటారు కాబట్టి ప్రజలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేరతారు.
చరిత్ర: అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను ప్రధాని నరేంద్ర మోడీ 2014 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్‌జిఎ) ప్రతిపాదించారు. పిఎం నరేంద్ర మోడీ జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినంగా సూచించారు, ఎందుకంటే జూన్ 21 ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు మరియు ఉంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. 11 డిసెంబర్ 2014 న, UNGA జూన్ 21 ను 69/131 తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.
8. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తమ దేశ సామాజిక మాధ్యమాల నుండి తొలగించిన దేశం ఏది..? A. అమెరికా B. పాకిస్తాన్ C. చైనా D. నేపాల్
Ans: C మోదీ ప్రసంగాన్ని తొలగించిన చైనా సామాజిక మాధ్యమాలు బీజింగ్: ప్రధాని మోదీ శుక్రవారం ముఖ్యమంత్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగంతోపాటు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యలను చైనా సామాజిక మాధ్యమ సైట్లు తమ ఖాతాల్లోంచి తొలగించాయి. ఈ మేరకు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న గంభీర పరిస్థితుల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. తొలుత భారత దౌత్యకార్యాలనికి చెందిన ‘సినా వెయిబో’ ఖాతా నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వ్యాఖ్యల్ని తొలగించారు. వీచాట్ అకౌంట్ నుంచి కూడా ఆయన వ్యాఖ్యలు తొలగింపునకు గురయ్యాయి.
Additional Questions :
1. 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది? 1) అసున్సియోన్, పరాగ్వే 2) శాన్‌జోస్, కోస్టారికా 3) హవానా, క్యూబా 4) గ్వాడాలజారా, మెక్సికో
Ans: 4
2. 13వ దక్షిణాసియా క్రీడల మొత్తం పతకాల పట్టిక జాబితాలో అగ్రస్థానం పొందిన దేశం ఏది? 1) పాకిస్తాన్ 2) నేపాల్ 3) బంగ్లాదేశ్ 4) భారత్
Ans: 4[/bg_collapse_level2]
3. “హాప్ ఆన్: మై అడ్వెంచర్స్ ఆన్ బోట్స్, ట్రైన్స్ అండ్ ప్లేన్స్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) సల్మాన్ రష్దీ 2) రస్కిన్ బాండ్ 3) విక్రమ్ సేథ్ 4) అరుంధతి రాయ్
Ans: 2
4. అంగారక గ్రహం కోసం నాసా రూపొందించిన మొదటి హెలికాప్టర్‌కు ‘నేమ్ ది రోవర్’ పోటీలో గెలిచి ‘ఇంజెన్యూటీ’(చాతుర్యం)గా నామకరణం చేసిన వ్యక్తి పేరు? 1) తనీష్ అబ్రహం 2) పి. సంజన 3) వనీజా రూపానీ 4) అర్ష్‌దీప్ సింగ్
6. జియోస్మార్ట్ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది? 1) హైదరాబాద్, తెలంగాణ 2) కోల్‌కతా, పశ్చిమ బంగా 3) ముంబై, మహారాష్ట్ర 4) న్యూఢిల్లీ, ఢిల్లీ
Ans: 1
7. 2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది? 1) రష్యా 2) హంగేరి 3) జార్జియా 4) సెర్బియా
Ans: 4
8. తమ ప్రయాణికులకు వేగంగా యాంటీబాడీ పరీక్ష నిర్వహిస్తున్న ప్రపంచంలోనే మొదటి విమానయాన సంస్థ ఏది? 1) ఖతార్ ఎయిర్వేస్ 2) ఎమిరేట్స్ ఎయిర్వేస్ 3) ఎయిర్ ఇండియా 4) క్వాంటాస్ ఎయిర్వేస్
Ans: 2[/bg_collapse_level2]
9. హీట్ వేవ్ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు? 1) జైపూర్, రాజస్థాన్ 2) బెంగళూరు, కర్ణాటక 3) ముంబై, మహారాష్ట్ర 4) కోల్‌కతా, పశ్చిమ బంగా
Ans: 2
10. ఆసియా/ ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికైన మొదటి భారత టెన్నిస్ ఆటగాడి పేరు ఏమిటి? 1) లియాండర్ పేస్ 2) మహేష్ భూపతి 3) విజయ్ అమృత్‌రాజ్ 4) సానియా మీర్జా