Most important for APPSC, TSPSC, RRB and central Jobs also
Daily Current Affairs & G.K -15-06-2020
1. ఇటీవల మరణించిన బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ ఏ సినిమాతో ప్రసిద్ధి చెందారు..? A. కాలపాని B. దబంగ్ C. M.S. ధోని D. సచిన్
Ans: C సుశాంత్ ఆత్మహత్య.. షాక్‌లో బాలీవుడ్
Mumbai :బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది.
2. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ ఇటీవల ప్రస్తావించిన కరోనా కట్టడి వ్యూహం 3 టి అనుసరిస్తున్న రాష్ట్రాలు..? A. కేరళ B. కర్ణాటక C. మహారాష్ట్ర D. A,B
బెంగళూరు: దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరులో కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే వాదన ఉంది. ముఖ్యంగా వీలైనన్ని కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా దీనిపై నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ స్పందించారు. తగినన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపకుండానే కొవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చనే ఆలోచనలో కొన్ని రాష్ట్రాలు/పట్టణాలు ఉన్నాయని..అయితే దీంతో కట్టడి అసాధ్యమని అమితాబ్ కాంత్ స్పష్టంచేశారు. 3టీ వ్యూహం(టెస్టింగ్-ట్రేసింగ్-ట్రీట్మెంట్)తో ముందుకెళ్తున్న కేరళ, కర్ణాటక, దక్షిణ కొరియా ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయని గుర్తుచేశారు. అక్కడి ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, కచ్చితంగా మాస్కులు ధరించడం వల్లే వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నాయని తెలిపారు. Static GK About నీతి ఆయోగ్ : ఏర్పాటు : 1 jan 2015 ప్రధాన కార్యాలయం : ఢిల్లీ చైర్మన్ : ప్రధాని వైస్ చైర్మన్ : రాజీవ్ కుమార్ CEO : అమితాబ్ కాంత్
3. ఇటీవల అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తొలి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించిన వారు ఎవరు..? A. హర్మెందర్ కౌర్ B. హర్ ప్రీత్ సింగ్ C. అన్మొల్ నారంగ్ D. అమూల్ నారంగ్
Ans: C
అమెరికాలో సిక్కు యువతి సరికొత్త చరిత్ర మిలిటరీ అకాడెమీ నుంచి తొలి సిక్కు గ్రాడ్యుయేట్‌గా అన్మోల్
వాషింగ్టన్: ప్రవాస భారతీయ సిక్కు కుటుంబానికి చెందిన అన్మోల్ నారంగ్ (23) అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 218 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మక యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా సాధించిన తొలి సిక్కు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. శనివారం అక్కడ జరిగిన స్నాతకోత్సవంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో అన్మోల్ పట్టా అందుకున్నారు. ఇప్పటికే ఆమె సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తదుపరి ఆమె ఒక్లోహామాలోని లాటన్లో ఉన్న ఫోర్ట్సిల్ సైనిక కేంద్రంలో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సులో శిక్షణ తీసుకోనున్నారు.
4. ఇటీవల అంతరిక్షంలోకి 61 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం పేరేంటి..? A. నాసా B. స్పేస్ ఎక్స్ C. ఇస్రో D. బోయింగ్
Ans: B
61 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్ వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ఎక్స్ శనివారం విజయవంతంగా 58 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. వీటితోపాటు మూడు స్కైశాట్ ఉపగ్రహాలనూ దిగువ భూ కక్ష్యలోకి ప్రయోగించింది. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగానంతరం ఈ రాకెట్.. తిరిగి క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. తాజాగా ప్రయోగించిన వాటిలో 58 ఉపగ్రహాలు ‘స్టార్‌లింక్’ ప్రాజెక్టుకు సంబంధించినవి. భూమిపై విస్తృత స్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంధానత ఇవ్వడం దీని ఉద్దేశం. 2018 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కింద మొత్తం 12వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా కక్ష్యలోకి ప్రవేశించిన స్కైశాట్ శాటిలైట్లు భూమి మీద నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను అప్పటికప్పుడు అందించగలవు. Static GK About Space X: ఏర్పాటు : 2002 వ్యవస్థాపకుడు : ఎలాన్ మస్క్ ప్రధాన కార్యాలయం : కాలిఫోర్నియా, usa
5. భారత అత్యున్నత న్యాయ అధికారి అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..? A. ఒక సంవత్సరం B. రెండు సంవత్సరాలు C. మూడు సంవత్సరాలు D. నాలుగు సంవత్సరాలు
Ans: A
అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్ కొనసాగింపు ఈనాడు, దిల్లీ: సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ను మరో ఏడాదిపాటు అటార్నీ జనరల్‌గా కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నెలాఖరుతో కేకే వేణుగోపాల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మూడేళ్లుగా అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ అందిస్తున్న సేవలు అభినందనీయం. మరో ఏడాదిపాటు కొనసాగాలని కోరగా ఆయన అంగీకరించారు’’ అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘‘ఏడాది ముగిసేనాటికి నా వయసు 90కి చేరుకుంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఈ వయసులో పనిచేసే అటార్నీ జనరల్ లేదా న్యాయ అధికారి ఎవరూ లేరు’’ అని కేకే వేణుగోపాల్ తెలిపారు. ఆయన 2017లో జులై 1న 15వ అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల కాలంలో ఆర్టికల్ 370 రద్దు, ఆధార్, పౌరసత్వ సవరణ బిల్లు వంటి అనేక కీలక కేసుల్లో కేంద్రం తరఫున సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. మొరార్జీ దేశాయ్ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన కేకే వేణుగోపాల్ ఆరు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. Static GK About AJI. : ఏర్పాటు : 28 Jan 1950 మొదటి అటార్నీ జనరల్ : M.C. sethalwad ప్రస్తుతం : K.K. venu Gopal పదవి కాలం : రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు
6. ఇటీవల భారత దిగ్గజ కమ్యూనికేషన్ సంస్థ jio లో 9,10 కంపెనీలుగా 6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఏవి..? A. TPG B. L ketarton C. A.B D. ఏదీకాదు
Ans: C
జియోలోకి మరో రూ.6441 కోట్లు ముంబయి: జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా రూ.6441 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థ టీపీజీ రూ.4,546.80 కోట్లు, ఎల్ కేటర్టన్ రూ.1894.50 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్స్ ప్రకటించాయి. రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువ; రూ.5.16 లక్షల కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం.. ఈ పెట్టుబడులు రానున్నాయి. వాటా ప్రకారం చెప్పాలంటే.. జియోలో టీపీజీకి 0.93%, ఎల్ కేటర్‌టన్‌కు 0.39% వాటా దక్కుతుంది. కాగా, తాజా పెట్టుబడితో ఇప్పటిదాకా జియో ప్లాట్‌ఫామ్స్ మొత్తం రూ.1,04,326.90 కోట్లను సమీకరించినట్లయింది.
7. ఇటీవల మరణించిన మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ మ్యాట్ పూరె (90) ఏ దేశానికి చెందిన వ్యక్తి..? A. ఆస్ట్రేలియా B. ఇంగ్లాండ్ C. సౌత్ ఆఫ్రికా D. న్యూజిలాండ్
Ans: D కివీస్ మాజీ క్రికెటర్ మృతి ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ టెస్టు క్రికెటర్ మ్యాట్ పూరె (90) శనివారం మరణించాడు. 1955లో భారత పర్యటనకు వచ్చిన కివీస్ జట్టులో అతను ఓ సభ్యుడు. కుక్కలంటే ఇష్టమున్న మ్యాట్ ఆ పర్యటనలో బెంగళూరులో మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన వీధి కుక్కను పట్టుకునే ప్రయత్నించాడు. దాన్ని దాన్ని తీసుకుని బయట వదిలేద్దామనుకున్నాడు. కానీ అది అతణ్ని కరిచింది. దాంతో అతను 12 సూదులు ఇప్పించుకోవాల్సి వచ్చింది. జట్టుతో పాటు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో పన్నెండు రోజుల పాటు తన సహచరులే అతనికి సూదులు గుచ్చారు. ఆల్‌రౌండర్ మ్యాట్ తన కెరీర్లో 14 టెస్టులాడాడు. Static GK About NZ: ఏర్పాటు : 7 మే 1907 రాజధాని : Wellington ప్రధాని : jacinda Ardern ప్రధాన భాష : ఇంగ్లీష్ Currency : New Zealand Dollar
8. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ గిరిజన హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మిషన్ సువిద్య ప్రాజెక్టులో భాగంగా హాస్టళ్లకు ISO గుర్తింపు పొందిన మొదటి రాష్ట్రం..? A. తమిళనాడు B. కర్ణాటక C. ఆంధ్ర ప్రదేశ్ D. ఒరిస్సా
Ans: D గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లకు ISO ధృవీకరణ పొందిన దేశంలో ఒడిశా మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని అన్ని గిరిజన హాస్టళ్ళకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మరియు మానవ వనరుల ఏకరీతి ప్రమాణాలను అందించే ‘మిషన్ సువిద్య’ ప్రాజెక్టును ప్రారంభించింది.
9. Kovid-19 నేపథ్యంలో ఈ దేశం నుంచి భారత పౌరులను తరలించడానికి మరియు ద్వైపాక్షిక సంబంధాల పై భారత ప్రధాని సమీక్ష నిర్వహించారు..? A. Kenya B. టాంజానియా C. సౌత్ ఆఫ్రిక D. అమెరికా
Ans: B కోవిడ్ -19 నేపథ్యంలో టాంజానియా నుండి భారత పౌరులను తరలించడానికి అందించిన సహాయానికి ఇటీవల భారత ప్రధాని యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా అధ్యక్షుడు డాక్టర్ జాన్ పోంబే జోసెఫ్ మాగుఫులికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక సంబంధాన్ని సమీక్షించారు మరియు పెరుగుతున్న అభివృద్ధి భాగస్వామ్యం, విద్యా సంబంధాలు, వాణిజ్యం మరియు పెట్టుబడి ప్రవాహాలపై సంతృప్తి వ్యక్తం చేశారు మరియు ఈ పోకడలను మరింత వేగవంతం చేసే అవకాశాలను చర్చించారు. Static GK About టాంజానియా : ఏర్పాటు : 9 Dec 1961 రాజధాని : దొడోమ President : John Magifuli ప్రధాని : కస్సిం మాజలివా ప్రధాన భాష : స్వహిల్ కరెన్సీ : Tanjaniyan Shilling
10. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు..? A. శ్రీనివాస్ రెడ్డి B. బాల సుబ్రహ్మణ్యం రెడ్డి C. వైకుంఠ రెడ్డి D. బైరెడ్డి
Ans: B ప్రొటోకాల్ డైరెక్టర్‌గా బాలసుబ్రమణ్యంరెడ్డి ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్‌గా ఎం.బాలసుబ్రమణ్యంరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థలో సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్నారు. ప్రొటోకాల్ విభాగం డిప్యూటీ సెక్రటరీగానూ బాలసుబ్రమణ్యంరెడ్డినే నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ (ఏపీఏఎల్సీ) ఎండీ పోస్టులోనూ ఈయన పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
11. ఇటీవల చైనా లో ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్ ఉద్దేశం ఏంటి..? A. గ్రహ శకలాలను కనుగొనడానికి B. నూతన గ్రహాల అన్వేషణ C. నక్షత్రాల పుట్టుక D. గ్రహాలపై పై నీటి జాడలు
Ans: B
గ్రహాంతర అన్వేషణ సాధనం
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్. చైనాలోని గుయిఝౌలో ఏర్పాటు చేశారు దీనిని. దీని వ్యాసం ఐదువందల మీటర్లు. అందుకే దీనిని ‘ఫైవ్హండ్రడ్ మీటర్ స్ఫెరికల్ టెలిస్కోప్’ (ఫాస్ట్) అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. అయితే, రేడియో తరంగాల అంతరాయాలు ఏర్పడటంతో, వాటిని తొలగించేందుకు దీని పనిని శాస్త్రవేత్తలు నిలిపివేశారు
12. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టే చంద్రమండల యాత్ర ‘హ్యూమన్ ఎక్స్‌ఫ్లోరేషన్, ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్’ కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు తన పేరేంటి..? A. కాథీ లూడెర్స్ B. కాతి ఉబెన్స్ C. విలియమ్ బిజోలి D. డాక్టర్ క్యాతి
Ans : A
జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చేపట్టిన చంద్రమండల యాత్రకు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ‘హ్యూమన్ ఎక్స్‌ఫ్లోరేషన్, ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్’ హెడ్‌గా కాథీ లూడెర్స్ను నియమిస్తున్నట్లు నాసా ప్రతినిధి జిమ్ బ్రైడెన్స్టోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇద్దరు వ్యోమగాములతో మే 30వ తేదీన ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కాథీ లూడెర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఆమె 1922లో నాసాలో చేరారు. స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్స్ అభివృద్ధి విషయంలో టెస్టింగ్ ప్రోగ్రామ్‌లకు ఇన్చార్జిగా సేవలందించారు. 2024లో చేపట్టనున్న చంద్రమండల యాత్రకు నాసా సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలన్నదే ఈ యాత్ర లక్ష్యం. నాసా చంద్రమండల యాత్ర కాథీ లూడెర్స్ ఆధ్వర్యంలోనే జరగనుంది.
Additional Questions : : 1. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో ‘ఫుడ్ ఫారెస్ట్’ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది? 1) మహారాష్ట్ర 2) కేరళ 3) హర్యానా 4) ఒడిశా
Ans: 2
2. గ్రామీణ ప్రాంతాల సీనియర్ సిటిజన్ల కోసం ‘పంచవతి యోజన’ ప్రారంభించిన రాష్ట్రానికి పేరు పెట్టండి. 1) అరుణాచల్ ప్రదేశ్ 2) మధ్యప్రదేశ్ 3) హిమాచల్ ప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
Ans: 3
3. “పూనమ్ అవ్లోక్కన్” సర్వే ప్రకారం, గిర్ అభయారణ్యం వద్ద ఆసియా సింహం జనాభా 5 సంవత్సరాలలో 29% (సుమారు) కు పెరిగింది. గిర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? 1) గుజరాత్ 2) మహారాష్ట్ర 3) మధ్యప్రదేశ్ 4) పంజాబ్
Ans: 1
4. జూన్ 2020 లో పర్యావరణ మంత్రిత్వ శాఖను ‘పర్యావరణ మరియు వాతావరణ మార్పు’ మంత్రిత్వ శాఖగా మార్చిన రాష్ట్ర / యుటి ప్రభుత్వం ఏది? 1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్ 3) హర్యానా 4) ఒడిశా
Ans: 1
5. వలస కార్మికుల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజె) ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించింది. AB-PMJAY యొక్క CEO ఎవరు? 1) అమితాబ్ కాంత్ 2) ఇందూ మల్హోత్రా 3) తన్వీర్ సింగ్ 4) ఇందూ భూషణ్
Ans: 4
6. ఫిట్ ఇండియా భాగస్వామ్యంతో ఎంహెచ్ఆర్డి ప్రత్యేక చిత్రాలను నిర్మించడం ద్వారా ఎన్ని దేశీయ క్రీడలను ప్రోత్సహిస్తారు? 1) 15 2) 13 3) 10 4) 8
Ans: 3
7. సముద్ర సరిహద్దులను గుర్తించడానికి ఇటలీతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? 1) గ్రీస్ 2) బోస్నియా 3) క్రొయేషియా 4) టర్కీ
Ans: 1
8. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ (సిబిఐసి) ఇటీవల బెంగళూరు మరియు చెన్నైలలో ‘టురాంట్ కస్టమ్స్’ ను ప్రారంభించింది. సిబిఐసి చైర్మన్ ఎవరు? 1) ఎం అజిత్ కుమార్ 2) సంజయ్ దత్ 3) రజనీష్ కుమార్ 4) రాహుల్ చౌదరి
Ans: 1
9. జల్ జీవన్ మిషన్ (ఎఫ్వై 20-21) అమలు కోసం జార్ఖండ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? 1) 452 కోట్లు 2) 748 కోట్లు 3) 572 కోట్లు 4) 664 కోట్లు
Ans: 3
10. ఈస్టర్న్ నావల్ కమాండ్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అతుల్ కుమార్ జైన్ ఏ నగరంలో డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డిఎస్ఆర్వి) కాంప్లెక్స్‌ను ప్రారంభించారు? 1) విశాఖపట్నం 2) సూరత్ 3) ముంబై 4) కొచ్చి