Daily Current Affairs Most important for all Exams,
Daily Current Affairs – 08-06-2020
1. ఇటీవల మరణించిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు హంస కోయా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి..? A. మణిపూర్ B. అస్సాం C. మధ్యప్రదేశ్ D. మహారాష్ట్ర
Ans: D
కరోనాతో మాజీ ఫుట్‌బాలర్ మృతి మలప్పురం (కేరళ): మహారాష్ట్రకు చెందిన మాజీ ఫుట్‌బాలర్ హంసకోయా (61) కరోనా వైరస్ బారిన పడి శనివారం ఉదయం ఆసుపత్రిలో మరణించాడు. జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ (సంతోష్ ట్రోఫీ)లో మహారాష్ట్ర తరపున ప్రాతినిథ్యం వహించిన అతను ముంబయిలో స్థిరపడ్డాడు. గత నెల 21న తన కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వచ్చాడు. తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు తేలింది. అతనికి న్యూమోనియా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Static GK About మహారాష్ట్ర : ఏర్పాటు : 1 మే 1960 రాజధాని : ముంబాయి గవర్నర్ : భగత్ సింగ్ కోష్యరి ముఖ్యమంత్రి : ఉద్ధవ్ ఠాక్రే విధానమండలి : 78 విధాన పరిషత్ ; 288 రాజ్యసభ 19 లోక్ సభ : 48 అధికార భాష : మరాఠీ ప్రత్యేకత : వాణిజ్య రాజధాని వైశాల్యపరంగా : మూడో స్థానం జనాభా పరంగా : రెండవ స్థానం
2. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రహదారుల పైన జంతు మరణాలను నివారించడానికి UNDP జాతీయ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు..? A. రాజ్ నాథ్ సింగ్ B. నరేంద్ర మోడీ C. సుశీల్ కుమార్ షిండే D. నితిన్ గడ్కరీ
Ans: D ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 05, 2020) సందర్భంగా, కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి (MoRTH) శ్రీ నితిన్ గడ్కరీ ‘రహదారులపై మానవ మరియు జంతు మరణాల నివారణపై యుఎన్‌డిపి (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం) జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్లపై మరణ కేసులను తగ్గించడం లేదా తొలగించడం లక్ష్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.
Static GK About UNDP : ఏర్పాటు : 22 నవంబర్ 1965 ప్రధాన కార్యాలయం : న్యూయార్క్ అమెరికా డైరెక్టర్ జనరల్ : ఆచిం స్టీనర్
3. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఆదాయం ఉపాధి కల్పన ను పెంచడానికి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం సవరించిన ఆర్డర్..? A. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ B. ప్రైవేట్ ప్రొఫైల్ మెంట్ ఆర్డర్ C. పబ్లిక్ ప్రొఫైల్ ఆర్డర్ D. ప్రైవేట్ ప్రొఫార్మా ఆర్డర్
Ans: A మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రోత్సహించడానికి మరియు ఆదాయం మరియు ఉపాధి కల్పనను పెంచడానికి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) 2019 మే 29 న పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్‌ను సవరించింది
.Static GK About Make in india : ప్రారంభం : 25 సెప్టెంబర్ 2014 ప్రారంభించిన వారు : నరేంద్ర మోడీ పేరెంట్స్ మినిస్ట్రీ : మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉద్దేశం: స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం
4. ఆసియా-పసిఫిక్ వార్షిక గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ 2020 ప్రకారం సమర్థవంతమైన నీటి నిర్వహణ లో అత్యధికంగా ప్లాటినం గుర్తింపు పొందిన భారత దేశ విమానాశ్రయం ఏది..? A. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ B. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ C. డం డం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ D. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
Ans: D
5 జూన్ 2020 న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆసియా-పసిఫిక్ వార్షిక గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ 2020 విమానాశ్రయాల కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) 15-35 కింద సమర్థవంతమైన నీటి నిర్వహణ కోసం జిఎంఆర్ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిహెచ్ఐఎ) కు అత్యధిక ప్లాటినం గుర్తింపును ఇచ్చింది. సంవత్సరానికి మిలియన్ ప్యాసింజర్స్ (ఎంపిపిఎ) వర్గం. Static GK About RGIA : ఏర్పాటు : 23 మార్చి 2008 ప్రదేశం : తెలంగాణ రాష్ట్రం ఆదికృత వాటా : GMR: 63% TS: 13%. Malaysia Holdings: 11%
5. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ IIFL బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన భారత క్రికెటర్ ఎవరు..? A. విరాట్ కోహ్లీ B. మహేంద్రసింగ్ ధోని C. సురేష్ రైనా D.రోహిత్ శర్మ
Ans: D 2020 మే 28 న, భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతకం చేసి, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ యొక్క మొదటి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఐఐఎఫ్ఎల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు కో-ప్రమోటర్ ఆర్.వెంకటరామన్ ప్రకటించారు.
Static GK About IIFL : ఏర్పాటు : 1995 ప్రధాన కార్యాలయం : ముంబై వ్యవస్థాపకులు : నిర్మల్ జైన్ చైర్మన్ : బాలాజీ వాసుదేవన్
6. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఎన్నోవ సారి ఎంపికయింది..? A.5 B. 6 C. 7 D. 8
Ans: D
ఇటీవల, 2021-22లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) లో తాత్కాలిక సభ్యునికి ఓటు వేయడానికి ముందే భారతదేశం ఒక ప్రచార బ్రోచర్‌ను విడుదల చేసింది.
2011-2012లో చివరిసారిగా భారత్ తాత్కాలిక సభ్య దేశంగా యుఎన్ఎస్సి సీటును ఆక్రమించడం ఇది ఎనిమిదోసారి.
7. అమెరికాలో రాజుకున్న జాతి వివక్షత వ్యతిరేక పోరాటంలో నల్లజాతీయుల కోసం 10 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించిన ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఎవరు..? A. మైఖేల్ జోర్డాన్ B. మైఖేల్ మిచిగాన్ C. మైఖెల్ రాబర్ట్ D.జార్జ్ ఫ్లాయిడ్
Ans: A బ్లాక్స్ కోసం.. మైఖేల్ జోర్డాన్ 10 కోట్ల డాలర్ల విరాళం
హైదరాబాద్: జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాజిక సంఘాలకు సుమారు వంద మిలియన్ల(10 కోట్ల) డాలర్ల సహాయం చేయనున్నట్లు మేటి ఎన్బీఏ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ ప్రకటించారు. వర్ణ సమానత్వం కోసం పోరాటం చేస్తున్న వారికి ఆ నిధులను ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికాను అతలాకుతలం చేస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో జోర్డాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో జోర్డాన్ బ్రాండ్ ద్వారా ఆ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాలోకానికి చెందిన ఓ అథ్లెట్.. ఇంత పెద్ద మొత్తాన్ని ఎన్జీవోలకు ఇవ్వడం ఇదే తొలిసారి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నది వివాదాస్పద నినాదం కాదు అని, జాతివివక్ష నిర్మూలన జరిగే వరకు, నల్లజాతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల ఎన్‌బీఐ స్టార్ ప్లేయర్ జోర్డాన్ నివాళి అర్పించారు.
8. కొవిద్-19 పైన ఇటీవల ఈ దేశము శ్వేతపత్రం విడుదల చేసింది..? A. అమెరికా B. రష్యా C. చైనా D.భారత్
Ans: C
కొవిడ్-19పై చైనా ‘శ్వేతపత్రం’! తొలుత డిసెంబర్ 27న గుర్తించినట్లు వివరణ.. విమర్శల నేపథ్యంలో సమర్థించుకునే ప్రయత్నం
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్‌పై చైనా వ్యవహారశైలి ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉంది. దీనిపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా తప్పుపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వైరస్ గురించి ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వకుండా కనీసం అప్రమత్తం కూడా చేయలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వీటినుంచి బయటపడేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా కొవిడ్-19 వైరస్‌కు సంబంధించి పూర్తి వివరణతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన మాత్రమే ఈ వైరస్‌ను వుహాన్ నగరంలో గుర్తించినట్లు శ్వేతపత్రం ద్వారా స్పష్టంచేసింది.
9. ఇటీవల గూఢచర్యం కేసులో అరెస్టు చేయబడిన అబ్దుల్ రెహమాన్ జబ్బార్ షేక్ ఈ దళానికి చెందిన వ్యక్తి..? A. భారత వైమానిక దళం B. భారత నావికాదళం C. భారత మిలటరీ దళం D.భారత పారామిలిటరీ దళం
Ans: B
విశాఖ గూఢచర్యం: కీలక సూత్రధారి అరెస్టు
ముంబయి: విశాఖ తూర్పు నౌకదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ముంబయికి చెందిన అబ్దుల్ రెహమాన్ జబ్బార్ షేక్‌ను అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే జబ్బార్ షేక్ భార్య కైసర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ.. తాజాగా అతడి ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జబ్బార్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
10. ఇటీవల ఏ రాష్ట్రం లో మొట్టమొదటి స్నేక్ రెస్క్యూ సెంటర్ ప్రారంభించారు..? A. తమిళనాడు B. కేరళ C. సిక్కిం D.తెలంగాణ
Ans: D భౌరంపేట్‌లో స్నేక్ రెస్క్యూ సెంటర్ ప్రారంభం మేడ్చల్ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన స్నేక్ రెస్క్యూ సెంటర్‌ను జూన్ 5న తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని మంత్రి ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు
11. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోనే మొట్టమొదటి వ్యర్థాల బదలాయింపు ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ప్రారంభించిన రాష్ట్రం..? A. ఢిల్లీ B. అరుణాచల్ ప్రదేశ్ C. గుజరాత్ D. ఆంధ్ర ప్రదేశ్
Ans: D
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో మొట్టమొదటి వ్యర్థాల బదలాయింపు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్(ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 5న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఇలా వ్యర్థాల సక్రమ నిర్వహణకు తొలి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించడం మంచి పరిణామన్నారు. వ్యర్థాలను వంద శాతం సురక్షితంగా పార వేయడం, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఆడిటింగ్ చేయడం వంటి లక్ష్యాలతో ఏపీఈఎంసీ ఏర్పాటైందన్నారు.
Additional Questions :
1. “Wuhan Diary: Dispatches from a Quarantined City” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) లు జున్ 2) మో యాన్ 3) హువా యు 4) ఫాంగ్ ఫాంగ్
Ans: 4
2. సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ(ఎన్ఏఎల్) అభివృద్ధి చేసిన నాన్-ఇన్వాసివ్ బై-లెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (BiPAP) వెంటిలేటర్ పేరు ఏమిటి? 1) ప్రతిక్ 2) స్వస్థ్ వాయు 3) అంబు బ్యాగ్ 4) ప్రాణా
Ans: 2
3. దేశంలో సురక్ష స్టోర్ కార్యక్రమాన్ని శక్తిమంతం చేయడానికి ‘సేఫ్జాబ్’, ‘సీకిఫై’ అనే స్టార్టప్‌లతో ఏ విభాగం భాగస్వామ్యం ఏర్పరచుకుంది? 1) వ్యవసాయ, సహకార శాఖ 2) వాణిజ్య విభాగం 3) రెవెన్యూ శాఖ 4) వినియోగదారుల వ్యవహారాల విభాగం
Ans: 4
4. దేశంలో స్టార్టప్‌ల కోసం మొదటి సైబర్ సెక్యూరిటీ యాక్సిలరేటర్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? 1) తమిళనాడు 2) తెలంగాణ 3) ఆంధ్రప్రదేశ్ 4) కర్ణాటక
Ans: 4
5. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ ప్రారంభించిన డిజిటల్ కాన్ఫరెన్స్ పేరు ఏమిటి? 1) AWAKE 2) RAISE 3) Innovation AI 4) RESTART
Ans: 4
6. ‘ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఆప్కే ద్వార్ యోజన’ (మీ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్) ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? 1) మధ్యప్రదేశ్ 2) గుజరాత్ 3) మహారాష్ట్ర 4) రాజస్థాన్
Ans: 1
7. 2020 క్యాలెండర్ సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి అంచనా ఎంత? 1) 3.2% 2) 0.6% 3) 0.5% 4) 1.2%
Ans: 4
8. సముద్ర, లోతట్టు మత్స్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద 20,000 కోట్లు కేటాయించింది? 1) ప్రధాన్ మంత్రి ముద్ర యోజన 2) ప్రధాన మంత్రి మత్స్యకార్ యోజన 3) ప్రధాన్ మంత్రి మత్స్య శ్రామిక్ యోజన 4) ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన
Ans: 4
9. ఏ రాష్ట్రానికి చెందిన సోహ్రాయ్ ఖోవర్ పెయింటింగ్‌కు భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు లభించింది? 1) జార్ఖండ్ 2) బీహార్ 3) ఆంధ్రప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
Ans: 1
10. భారత్, మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది? 1) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 2) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 4) ఛత్రపతి